ఛోటా ఉదేపూర్: గుజరాత్లో ఓ నకిలీ ఆఫీస్ ఏర్పాటు చేసి,రూ.4.16 కోట్ల ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సందీప్, అబు బకర్ సయ్యద్‌ను అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసులు శనివారం వెల్లడించారు. బోగస్ ప్రాజెక్టులకు ప్రభుత్వ నిధులు పొందేందుకు బొదేలీ పట్టణంలో సందీప్ ఇరిగేషన్ ప్రాజెక్టు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేరుతో 2021లో నకిలీ కార్యాలయం ఏర్పాటు చేశాడు. అతడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన అధికారులు నిధులు విడుదల చేశారు. తర్వాత పలు ప్రాజెక్టులకు రూ.3.75 కోట్లు కోరుతూ సదరు ఫేక్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా.. ఈ మోసం వెలుగులోకి వచ్చింది.