జస్టిస్ సిర్పూరర్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సింగిల్ జడ్జి తీర్పు వెలువడే వరకు దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణను వాయిదా వేయాలని పోలీసులు హైకోర్టును కోరారు.
సంచలనం రేకెత్తించిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో ప్రతివాదులుగా ఉన్న పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వాదనలు కూడా విన్న తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.