ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్, దక్షిణాంచల్ విద్యుత్తు పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్తు కార్మికులు కన్నెర్రచేశారు.
యూపీలో రెండు డిస్కంలను ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ అఖిల భారత విద్యుత్తు ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.