టెట్ మార్కుల సవరణలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కొత్త మార్కులు ఆప్లోడ్ చేసినా.. ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు సీ టెట్ మార్కులు అప్లోడ్ చేయగా, ఇప్పుడవి కనిపించడం లేదు.
డీఎస్సీ పరీక్షల్లో రోజుకో వివాదం వెలుగుచూస్తున్నది. ఇప్పటికే పలు ప్రశ్నలు పునరావృతం కాగా, ఇటీవలే ప్రకటించిన ప్రాథమిక ‘కీ’లోనూ అనేక తప్పులు వెలుగుచూశాయి.