DSC | ఫైనల్ ‘కీ’లోనూ తప్పులు.. డీఎస్సీ పరీక్షల్లో రోజుకో వివాదం!
డీఎస్సీ పరీక్షల్లో రోజుకో వివాదం వెలుగుచూస్తున్నది. ఇప్పటికే పలు ప్రశ్నలు పునరావృతం కాగా, ఇటీవలే ప్రకటించిన ప్రాథమిక ‘కీ’లోనూ అనేక తప్పులు వెలుగుచూశాయి.
- డీఎస్ఈ కార్యాలయానికి బాధితుల క్యూ
- రివైజ్డ్ ‘కీ’ విడుదల చేయాలని డిమాండ్
- సవరించి న్యాయం చేయాలని అభ్యర్థుల వేడుకోలు
DSC | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్షల్లో రోజుకో వివాదం వెలుగుచూస్తున్నది. ఇప్పటికే పలు ప్రశ్నలు పునరావృతం కాగా, ఇటీవలే ప్రకటించిన ప్రాథమిక ‘కీ’లోనూ అనేక తప్పులు వెలుగుచూశాయి. ఇది చాలదంటూ తాజాగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ ఫైనల్ ‘కీ’లోనూ తప్పులున్నాయి. కొన్ని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చారని, కొన్ని ప్రశ్నలకైతే ఇచ్చిన ఆప్షన్లలో అసలు సమాధానాలే లేవని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం పలువురు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కు తరలివచ్చారు. 100 మందికి పైగా అభ్యర్థులు విద్యాశాఖ అధికారులను కలిసి పలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా జూలై 22, 23న జరిగిన ఎస్జీటీ ఫైనల్ ‘కీ’ పై అభ్యంతరాలు వెలిబుచ్చారు. తప్పులు సవరించి, మార్కులు కలపాలని కోరారు.
ఫలితాలు ఆలస్యం..
అభ్యర్థుల అభ్యంతరాల నేపథ్యంలో డీఎస్సీ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశముంది. వంద మందికి పైగా అభ్యర్థులు ఫైనల్ కీపై అభ్యంతరాలు వ్యక్తంచేయగా, వాటిని పరిశీలించి మరోసారి సబ్జెక్టు నిపుణుల కమిటీకి ఆధారాలు పంపిస్తామని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. తప్పులు నిజంగానే దొర్లాయని నిపుణుల కమిటీ గుర్తిస్తే మళ్లీ రివైజ్డ్ ‘కీ’ని విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీఎస్సీలో వచ్చిన మారులు, టెట్ మారులను కలిపి జీఆర్ఎల్(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్)ను విడుదల చేస్తారు. అనంతరం 1:3 జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టి మెరిట్ ప్రకారం నియామక పత్రాలను అందజేస్తారు. అయితే తుది ‘కీ’ లోనూ తప్పులు దొర్లితే ఈ ప్రక్రియంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది.
ఫైనల్ ‘కీ’పై అభ్యర్థుల అభ్యంతరాలు ఇలా..
ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు?
ఆప్షన్లు : 1)ఏకాదేశం 2)ఆదేశం
3)బహుళము 4)నిత్యము
అయితే అధికారులు విడుదల చేసిన తుది కీ ప్రకారం సరైన సమాధానం ఆప్షన్ 2) ఆదేశం అని ఇచ్చారు. కానీ అభ్యర్థులు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1) ఏకాదేశం అంటున్నారు. ఇదే ప్రశ్న ఈ ఏడాది మే లో జరిగిన టెట్ పరీక్షలోనూ ఇచ్చారు. ఫైనల్ కీలో సమాధానం ఏకాదేశం ఇచ్చారని, కానిప్పుడు డీఎస్సీలో ‘ఆదేశం’ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సరైన సమాధానం.. ఇప్పుడు డీఎస్సీలో ఎందుకు తప్పవుతుందని ప్రశ్నిస్తున్నారు. పుస్తకాల్లోనూ కరెక్ట్ ఆన్సర్ ‘ఏకాదేశం’ ఉందని అంటున్నారు.
భారత ఉపరాష్ట్రపతి వీరిచే ఎన్నుకోబడతారు?
ఆప్షన్లు: 1) పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన మరియు నామినేట్ చేయబడిన సభ్యులు
2)అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేలు
3)లోక్‌సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే
4)అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు,పార్లమెంట్ సభ్యులు
ఫైనల్ ‘కీ’ ప్రకారం సరైన సమాధానం ఆప్షన్
- కానీ అభ్యర్థులు చెబుతున్న దాని ప్రకారం సరైన జవాబు ఆప్షన్ 3 అంటున్నారు. పుస్తకాల్లోనూ ఇదే జవాబు ఉందని ఆధారాలు చూపిస్తున్నారు.
- ‘డ్నీపర్, వోల్గా వంటి నదులు ఈ ప్రాంతంలో ఉద్భవించాయి’ అనే ప్రశ్నలో ‘నైపర్’ అనే పదం అనువాదం తప్పుగా పడింది. దీనికి మార్కును కలపాలి.
- మనం మానసికంగా ఆరోగ్యవంతుడు అని చెప్పినప్పుడు.. అది ఈ క్రింది అంశాల పరంగా ఆరోగ్యకరమని అర్థం’ ఈ ప్రశ్నకు ఏ, బీ, సీ, డీ నాలుగు ఆప్షన్లు సరైనవి.
- పట్టణాలు, గ్రామాల్లో మీరు అత్యంత ఇష్టపడేవి ఏవీ అను ప్రశ్న ఈ విద్యాప్రమాణాన్ని సాధించేందుకు ఉద్ధేశించినది’ దీనికి సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట సరైన సమాధానం.
- ఇన్విట్రో ఫెర్టిలైజేషన్‌లో ‘ఇన్విట్రో’ అం టే అక్షరాలా అర్థం అన్న ప్రశ్నకు ప్రయోగశాలలో అన్నది కూడా సరైన సమాధానం.
- ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పవర్ పార్క్‌ను ఈ రాష్ట్రంలో ప్రారంభించారు’ అన్న ప్రశ్న ఇచ్చారు. కానీ ఇంగ్లిష్‌లో శక్తిస్థల అన్న పేరు ఇచ్చి తెలుగులో ఈ పేరును ఇవ్వలేదు. కనుక దీనికి మార్కు కలపాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

