TET | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టెట్ మార్కుల సవరణలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కొత్త మార్కులు ఆప్‌లోడ్ చేసినా.. ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు సీ టెట్ మార్కులు అప్లోడ్ చేయగా, ఇప్పుడవి కనిపించడం లేదు. ఓ అభ్యర్థి ఈ నెల 2న అప్లికేషన్ అప్లోడ్ చేయగా, 129 మార్కులు చూపించింది. మూడు రోజుల క్రితం చూడగా పాత మార్కులు 91 మా ర్కులే చూపిస్తున్నది. మరో అభ్యర్థి ఎడిట్ ఆ ప్షన్లోకి వెళితే సబ్జెక్టు గణితం, సైన్స్ అని చూ పిస్తున్నది. వాస్తవానికి సదరు అభ్యర్థి సోషల్ స్టడీస్‌కు ఎగ్జామ్ రాశాడు. ఇక హాల్‌టికెట్ నెంబర్ ఎడిట్చేసుకునే అవకాశమిచ్చినా వెబ్సైట్లో ఆ అవకాశమే లేకుండా పోయింది. ఇవేకాకుండా అనేక తప్పిదాలు చోటుచేసుకున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2017 డిసెంబర్లో టెట్ పరీక్ష జరగలేదు. జూలై 23న జరిగింది. ఆగస్టు 4న ఫలితాలిచ్చారు. కానిప్పుడు ఎడిట్ ఆప్షన్లో మాత్రం 2017 డిసెంబర్ 1 అని చూపిస్తున్నది. అసలు 2017లో టెట్ జరిగిందే ఒక్కసారే. ఇలా అనేక తప్పిదాలున్నాయని, సవరించాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఫైనల్ ‘కీ’పై మరిన్ని అభ్యంతరాలు
డీఎస్సీ ఫైనల్ ‘కీ’పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు వందలకు పైగా రాగా, తాజాగా మరికొన్ని సబ్జెక్టుల ఫైనల్ కీపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. జూలై 18న నిర్వహించిన ఫిజికల్ సైన్స్ పేపర్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రశ్న నెంబర్ 3 యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ క్లోనింగ్ ఒప్పందం, ప్రశ్న నెంబర్ 7, ప్రశ్న నెంబర్ 32, 47, 54, 79, 117, 129, 136,137,143 ప్రశ్నలకిచ్చిన సమాధానాలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.