ఏ పని ముట్టుకోవాలన్న డబ్బే ప్రధానం. కానీ ఈ డబ్బును రుణాలుగా ఇచ్చే బ్యాంకుల వద్ద నగదు కొరత తారా స్థాయికి చేరుకున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నిధుల లేమితో సతమతమవుతున్నాయి.
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ రుణ వితరణకు తగిన నగదు నిల్వలు లేక అల్లాడుతున్నది. జీఎస్టీ, అడ్వాన్సు టాక్స్ చెల్లింపుల ఫలితంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో నగదు తరలివెళ్లింది. దీంతో జనవరి 24నాటికి మొత్తం దేశీ�