‘చాలా విరామం తర్వాత నేను నటించిన మాస్ సినిమా ఇది. నా గత చిత్రాలతో పోల్చితే యాక్షన్ ఘట్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంక్రాంతి సీజన్లో పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు’ అన్నారు అగ్ర హీరో నాగార్జున.
అగ్ర హీరో నాగార్జున నటించిన తా జా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
‘నా సామిరంగ’ చిత్రం తెలుగులో తనకు మంచి బ్రేక్నిస్తుందని చెప్పింది కన్నడ భామ ఆషిక రంగనాథ్. నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.