సరికొత్తగా ప్రజెంట్ చేశాను
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నారీ చిత్రంతో. కొరియోగ్రాఫర్‌గా తనదైన పేరు సంపాదించుకున్న విజయ్ బిన్ని డైరెక్టర్‌గా తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ సినిమాతో ముందుకొస్తున్నారు.
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నారీ చిత్రంతో. కొరియోగ్రాఫర్‌గా తనదైన పేరు సంపాదించుకున్న విజయ్ బిన్ని డైరెక్టర్‌గా తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ సినిమాతో ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘డైరెక్టర్ కావడం నా డ్రీమ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా చూశాక మొదట కొరియోగ్రఫీపై గ్రిప్ ఉండాలనిపించి ఇన్నాళ్లూ ఆగాను’ అన్నారాయన. ‘ఇంతకు ముందు నాగార్జున పాటలు చేశాను. అదే చొరవతో ఆయనకు కథ చెప్తే డైరెక్షన్ చేయమన్నారు.
కమర్షియల్ పంథాలోనే నా ైస్టెల్ చూపించే ప్రయత్నించాను. దర్శకుడిగా తొలి సినిమా ఆయనతో చేయడం నా అదృష్టం. డిఫరెంట్‌గా నాగ్‌ను చూపించడంలో సక్సెస్ అయ్యానని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. ‘అల్లరి నరేశ్‌కు నాగ్ అంటే పిచ్చి. ఇద్దరినీ ఈ ఫ్రెండ్షిప్ స్టోరీలో పెడితే బావుంటుందనిపించింది. మరో పాత్రకు యంగ్ యాక్టర్ కావాలని రాజ్‌తరుణ్‌ని తీసుకున్నాం. ముగ్గురి కథలూ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? వాళ్ల మధ్య పరిస్థితులు ఏమిటనేది ఆసక్తికరం’ అని వివరించారు.
‘ఆర్టిస్టులు సపోర్ట్ చేస్తే సినిమా ఎంత త్వరగా పూర్తి చేయొచ్చో ఈ ప్రాజెక్టుతో నేర్చుకున్నాను. కీరవాణి గారు ఎప్పుడూ నన్ను కొత్త దర్శకుడిగా చూడలేదు. కొరియోగ్రఫీ నేపథ్యం ఉన్న నేను ఏదైనా చెప్తే ఓ సెన్స్‌తోనే చెప్తున్నారని భావించారు. ఏఎన్నార్ఆర్ గారి ప్రజాదరణ పొందిన పాటే టైటిల్ అయితే బావుంటుందని అందరం అనుకొని దాన్నే ఖరారు చేశాం’ అని చెప్పారు. ‘విజయ్, దినేష్ మాస్టర్ చెరో పాట చేయగా, మిగతా నాలుగు పాటలకు కొరియోగ్రఫీ చేశా. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. ఇక ముందు కూడా అన్ని జోనర్ సినిమాలూ చేయాలనుంది’ అన్నారు విజయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

