కిష్టయ్య బాక్సాఫీస్‌ను కొడతాడు!
అగ్ర హీరో నాగార్జున నటించిన తా జా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
అగ్ర హీరో నాగార్జున నటించిన తా జా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ “టీవీలు వచ్చాక ఇక సినిమాలెవరూ చూడరు అన్నారు. ఫోన్లు వచ్చిన తర్వాతా అంతే అన్నారు. ఇప్పుడు ఓటీటీ అని కొత్తగా వచ్చినా, అన్నింటికీ మించి కొవిడ్ వచ్చినా సినిమాలకు ఆదరణ తగ్గలేదు. తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే సినిమా పండుగే. ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’తో వస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన తేజ ‘హను-మాన్’గా రాబోతున్నాడు. వెంకీ 75వ సినిమా ‘సైంధవ్’తో వస్తున్నాడు. అందరికీ ఆల్ ది బెస్ట్.
మేము ‘నా సామిరంగ’తో వస్తున్నాం. సంక్రాంతికి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు” అని ప్రసంగం ముగించారు. విజయ్ బిన్ని మాట్లాడుతూ ‘కొత్త డైరెక్టర్‌గా నాకు ఇంత పేరు తెచ్చిపెట్టిన టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఎన్నో సినీ వేడుకల్లో సామాన్యుల్లో ఒక్కడిగా పాల్గొన్న నేను డైరెక్టర్‌గా ఇప్పుడు ఈ స్టేజీ మీద డైరెక్టర్‌గా మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. నాగ్ సర్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

