Nagarjuna | ‘నా సామిరంగ’తో సంక్రాంతి పండగను తెరపై చూస్తున్న అనుభూతి: నాగార్జున
‘చాలా విరామం తర్వాత నేను నటించిన మాస్ సినిమా ఇది. నా గత చిత్రాలతో పోల్చితే యాక్షన్ ఘట్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంక్రాంతి సీజన్లో పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు’ అన్నారు అగ్ర హీరో నాగార్జున.
Nagarjuna | ‘చాలా విరామం తర్వాత నేను నటించిన మాస్ సినిమా ఇది. నా గత చిత్రాలతో పోల్చితే యాక్షన్ ఘట్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంక్రాంతి సీజన్లో పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు’ అన్నారు అగ్ర హీరో నాగార్జున. ఆయన నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకుడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నాగార్జున పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
మీ కెరీర్లో చాలా వేగంగా పూర్తి చేసుకున్న చిత్రమిదే అంటున్నారు?
అలాంటిదేమీ లేదు. కేవలం 35 రోజుల్లోనే పూర్తయిన నా చిత్రాలు చాలానే ఉన్నాయి. ‘నా సామిరంగ’ 72 రోజులు పాటు షూటింగ్ జరుపుకుంది. నేను అరవై రోజుల పాటు పనిచేశాను. అయితే షూటింగ్ డేట్ మొదలుకొని రిలీజ్ డేట్ వరకు పక్కా ప్రణాళికతో వేగంగా పూర్తి చేసిన సినిమా మాత్రం ఇదే.
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
మలయాళ మూల కథకు తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించాం. ముగ్గురు మిత్రులస్నేహబంధం చుట్టూ కథ నడుస్తుంది. ఇందులో ప్రేమ, త్యాగం, నమ్మకం..ఇలా అన్ని అంశాలుంటాయి. హృదయాన్ని కదిలించే ఎమోషన్స్‌తో కూడిన అద్భుతమైన కథ.
ఈ సినిమాలో సంక్రాంతి ప్రభల తీర్థం నేపథ్యాన్ని చూపించబోతున్నారని తెలిసింది?
భోగి, సంక్రాంతి, కనుమ.. ఈ మూడు రోజుల్లో జరిగే కథ ఇది. 1980 నేపథ్యంలో నడుస్తుంది. తెరపై సంక్రాంతి పండగను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కథాంశం తగినట్లు సంక్రాంతి రోజున విడుదల కావడం ఆనందంగా ఉంది.
ఈ తరహా సినిమాలు మీరు గతంలో చేశారు. ఇందులో మీ పాత్రకున్న ప్రత్యేకతలు ఏమిటి?
ఈ సినిమాలో నా పాత్ర పేరు కిష్టయ్య. అతను స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్తాడు. హీరోయిన్ ఆషికా రంగనాథ్‌తో నాకో ప్రేమకథ కూడా ఉంటుంది. దర్శకుడు విజయ్ బిన్నీ కొరియోగ్రాఫర్ కావడం వల్ల పాటలోనే కథను చెప్పే మంచి నేర్పు ఉంది. ఆయనలోని ఈ ప్రతిభ నచ్చే దర్శకుడిగా అవకాశమిచ్చాను. నా స్నేహితులుగా అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు.
మీ తదుపరి చిత్రాల గురించి..?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఈ నెలాఖరులో షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత కొత్త దర్శకుడితో యాక్షన్ సినిమా చేయబోతున్నా. ‘పఠాన్’ తరహాలో సాగే డిఫరెంట్ యాక్షన్ జోనర్ చిత్రమది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

