ఆమెతో పోల్చితే ఆనందమే!
‘నా సామిరంగ’ చిత్రం తెలుగులో తనకు మంచి బ్రేక్‌నిస్తుందని చెప్పింది కన్నడ భామ ఆషిక రంగనాథ్. నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘నా సామిరంగ’ చిత్రం తెలుగులో తనకు మంచి బ్రేక్‌నిస్తుందని చెప్పింది కన్నడ భామ ఆషిక రంగనాథ్. నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ ‘నాగార్జున వంటి అగ్ర హీరోతో తెరను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నేను పల్లెటూరి అమ్మాయి వరాలు పాత్రలో కనిపిస్తా. తను స్వతంత్య్ర భావాలు కలిగిన అమ్మాయి. సాధారణంగా గ్రామీణ నేపథ్య సినిమాల్లోని కథానాయికలు సున్నిత వ్యక్తిత్వంతో కనిపిస్తారు. కానీ వరాలు అలాంటి అమ్మాయి కాదు. తను ఓ ధిక్కార స్వభావి.
సినిమా చూసిన తర్వాత ‘అమ్మాయంటే ఇలాగే ఉండాలి’ అనుకుంటారు. కథానుగుణంగా నాగార్జునగారికి, నాకు మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కన్నడ, తెలుగు సంప్రదాయాలు ఒకేలా ఉంటాయి. అందుకే ఇక్కడి ఇండస్ట్రీ చాలా సౌకర్యంగా అనిపిస్తున్నది. నాకు సీనియర్ నాయిక అనుష్క అంటే చాలా ఇష్టం. నన్ను కొందరు జూనియర్ అనుష్క అని పిలుస్తుంటారు. అలాంటి గొప్ప నటితో పోల్చడం నాకు ఆనందమే (నవ్వుతూ). గ్లామర్‌తో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయాలనుకుంటున్నా. అలాగే పీరియాడిక్ ఫిల్మ్ చేయాలనుంది. ఏదో ఒకరోజు రాజమౌళిగారి సినిమాలో నటించాలని బలంగా కోరుకుంటున్నా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

