వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించాలనే ఆశలో రైతులు పంటపొలాల్లో హానికర రసాయనాలు, ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగిపో తుండగా, దిగుబడులు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.
ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురిసి, భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఒకేరకమైన పంటలను సాగుచేయటం వలన భూమిలోని సారం తగ్గిపోవటంతో పాటు క్రిమికీటకాలు ఇం