వివాదాస్పద డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు -2023ను బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. మణిపూర్ సమస్యపై విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజువాణీ ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు.
బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిన విధానంలోనే పలు అవకతవకలున్నాయి. ప్రజా సంప్రదింపుల ప్రక్రియలో పారదర్శకత, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో ఇవి జరిగాయి.