న్యూఢిల్లీ, ఆగస్టు 9: వివాదాస్పద డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు -2023ను బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. మణిపూర్ సమస్యపై విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజువాణీ ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యత రక్షణకు ఉద్దేశించినది. ఈ బిల్లు ప్రకారం ఏ సమాచారాన్నైనా నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఈ బిల్లు కారణంగా దేశ పౌరుల గోప్యత దెబ్బతింటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గోప్యతను కాపాడటంలో విఫలం చెందిన సంస్థలకు రూ.250 కోట్ల వరకు జరిమానా విధిస్తారు.