మంత్ర, మంగళ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు ఓషో తులసీరామ్. తాజాగా ఆయన మరో మహిళా ప్రధాన చిత్రం ‘దక్షిణ’తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు.
సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దక్షిణ’. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఓషో తులసీరామ్ దర్శకుడు.