సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దక్షిణ’. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఓషో తులసీరామ్ దర్శకుడు. ఇటీవల ఈ చిత్ర మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ…‘ఈ చిత్రానికి కథ ఎంత ఆకర్షణ అవుతుందో, నాయిక సాయి ధన్సిక పాత్ర కూడా అంతే హైలైట్ అవుతుంది. సైకో థ్రిల్లర్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాం. ప్రస్తుతం మూడొంతుల షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వచ్చే నెలతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. రిషభ్ బసు, సుభాష్, ఆనంద్ భారతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – నర్సింగ్, సంగీతం – బాలాజీ.