వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారకముందే పీఏసీఎస్ గోడౌన్ల వద్ద బారులుదీరుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు.
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో సాగు పనులు జోరం దుకున్నాయి. జూన్ మాసంలో కొంత తగ్గుముఖం పట్టినా.. జూలైలో పది రోజులుగా ఏకధాటిగా వాన పడుతోంది. ఫలితంగా అన్నదాతలు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. పత్త