జిల్లాలో ఈసారి సన్న వడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సన్న రకాల్లో 101, చిట్టి పొట్టి రకాలను సాగు చేశారు. గతంలో వానకాలంలో 40 నుంచి 50 శాతం, యాసంగిలో 80 నుంచి 90 శాతం మేర దొడ్డు రకం వడ్లు సాగు చేసేవారు.
జిల్లాలో ఈ ఏడాది వరి సాగు భారీగా పెరిగింది. వానకాలం ప్రారంభం నుంచి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో వరి సాగు అంచనాలకు మించి పెరగడం గమనార్హం. చెరువులు నిండడంతోపాటు బోరు బావుల్లో కూడా నీరు రావడంత