జిల్లాలో కొన్ని రోజులు గా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జూలై రెండో వారం వర కు నల్లటి మబ్బులే కనిపించినా చినుకు జాడలే క పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు దిగాలుచెందారు.
వానకాలం పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. రైతులకు లాభాన్నందించాలనే లక్ష్యంతో.. ఈ ఏడాది కొన్ని రకాల పంటల సాగును పెంచుతూ, మరికొన్ని పంటల సాగును తగ్గించారు.