పంటలకు ప్రాణం
జిల్లాలో కొన్ని రోజులు గా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జూలై రెండో వారం వర కు నల్లటి మబ్బులే కనిపించినా చినుకు జాడలే క పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు దిగాలుచెందారు.
- విస్తారంగా కురుస్తున్న వర్షాలు
- ఓ వైపు వరి..మరోవైపు మెట్ట పంటల జోరు
వనపర్తి, జూలై 23 : జిల్లాలో కొన్ని రోజులు గా విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ప్రాణం పోస్తున్నాయి. జూలై రెండో వారం వర కు నల్లటి మబ్బులే కనిపించినా చినుకు జాడలే క పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు దిగాలుచెందారు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు వ్యవసాయ రంగానికి ఊపి రిపోశాయి. దీంతో సాగు పనులు ఊపందుకో గా, వరి, పత్తితోపాటు మెట్ట పంటలు కళకళలాడుతున్నాయి.
వనపర్తి జిల్లాలో రైతులు వరితోపాటు పత్తినే అధికంగా సాగు చేస్తుంటారు. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలతోపాటు వరుస ముసురుతో ఈ ఏడాది సైతం రైతులు వరితోపాటు పత్తి సాగుకే ఎక్కువ మొగ్గు చూపారు. దీంతో మెట్టలో ప్రధానంగా పత్తి విస్తీర్ణం భారీగా పెరిగింది. వ్యవసాయశాఖ అధికారులు సైతం వరికి బదులు మె ట్ట పంటలను, ముఖ్యంగా పత్తినే సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండగా, బోరు బావుల్లోకి పుష్కలంగా నీరు వస్తున్నది. దీంతో కొన్ని ప్రాంతాల రైతులు వరి సాగును వ దులుకునేందుకు సిద్ధంగా లేరు. మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద అత్యధికంగా వరే సాగవుతున్నది. నాన్ ఆయకట్టులో మెట్టపంటలతోపాటు వరి సాగు చేపట్టారు.
జిల్లాలో సాగవుతున్న పంటలు..
జిల్లాలో ఇప్పటివరకు వానకాలంలో సాగవుతున్న పంటల్లో పత్తి 11,367 ఎకరాలు, వరి 8,376, కందులు 2,913, మొక్కజొన్న 1,657, జొన్న 998, నువ్వులు 47, ఆముదం 217, వేరుశనగ 130, చెరుకు 79, ఉల్లిగడ్డ 263, మిర్చి 244, ఆయిల్‌పాం 140, ఇతర పం టలు 14 ఎకరాలు మొత్తంగా 26,460 ఎకరా ల్లో సాగవుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురస్తుండడంతో పూర్తి స్థాయిలో పంటలు సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
విస్తారంగా వర్షాలు..
కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటల సాగు ఊపందకున్నది. రైతాంగం ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమైంది. జిల్లాలో జూన్ 1నుంచి ఈ నెల22 వర కు 186 మి.మీ వర్షపాతానికి గానూ 336.2 మి. మీ వర్షం కురిసింది. ఇప్పటికే 84 మి.మీ వర్షం అధికంగా నమోదైంది. తాజాగా కురుస్తున్న వానలతో మెట్టపంటల సేద్యం ఊపందుకోనున్నది. అయితే అధికంగా వానలు కురిస్తే పత్తిపై ప్ర భావం చూపించే అవకాశాలు లేకపోలేదు.
సాగుకు అనుకూలంగా వర్షాలు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. సకాలంలో వానలు పడుతుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుత సీజన్లో రైతులు సమయానికి విత్తనాలు వేశారు. వరి నారును కూడా సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో ఎరువులు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి.
– సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, వనపర్తి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

