ఉదయమంతా ఉక్కిరిబిక్కిర చేసిన అధిక ఉష్ణోగ్రత.. సాయంత్రానికి మటుమాయమైంది. అదే సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సరిగ్గా ఆ వెంటనే ఈదురుగాలులు ఊపందుకున్నాయి. ఆ కాసేపటికే వడగండ్ల వాన మొదలైంది.
భారీ వర్షాలకు మఠంపల్లి మండలంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.