అన్నదాత కష్టం అంతా ఇంతాకాదు. ఆరుగాలం కష్టపడి పండిస్తే మిగిలేది అంతంతమాత్రమే. ప్రారంభంలో నకిలీ విత్తనాల బెడద, పంట పెరుగుతున్న క్రమంలో చీడపురుగుల బాధ.. అందులో అకాల వర్షాలు వస్తే అంతే సంగతి.
తెల్ల బంగారానికి నకిలీ విత్తనాల బెడద దాపురించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి తర్వాత రైతులు ఎక్కువగా పండించే పంట పత్తి. దీంతో నాసిరకం విత్తనాలను పెద్దఎత్తున సరఫరా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. సీడ్స్