ప్రణబ్ జీ నా ఆకాంక్ష ఏమిటో మీకు తెలుసు. నాకు కావలసింది తెలంగాణ రాష్ట్రం. మీరు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనేది నాకు ప్రధానం కాదు. ఏదిచ్చినా సంతోషంగా స్వీకరిస్తా. కానీ దయయుంచి తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వండి’ - ఇది
దశాబ్దాలుగా మిగిలి పోయిన స్వప్నం.. ఏండ్లు గడుస్తున్నా గమ్యం చేరని స్వరాష్ట్ర పోరాటం.. ఎంతో మంది ఉద్దండులు ఉద్యమించినా నెరవేరని లక్ష్యం.. తెలంగాణపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ ఒక ఉద్యమ కెరటం ఎగిసింది.