రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు కదం తొక్కుతున్నారు. అలైన్మెంట్ మార్చే వరకు పోరాటం ఆగదని, హైదరాబాద్ నడిబొడ్డుకు కాదు ఢిల్లీకైనా సిద్ధమేనని ప్రకటించారు.
రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఆర్ బాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్లో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు.