పోయినేడు వరకు మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెక్‌డ్యాంలు ఈ ఎండకాలంలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. నిండా నీటితో కనిపించే వాగులు కళ చెదిరిపోయి దర్శనమిస్తున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వం చెక్‌డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి అద్భుతంగా కృషి చేస్తున్నదని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్, శాస్త్రవేత్తలు ప్రశంసించారు.