రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ జల్పల్లి పరిధిలోని చందన చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చందన చెరువు శిఖం ఫలహారం’ శీర్షికతో ప్రచురితమైన వరుస కథనాలతో అధికారులు కదిలివచ్చారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్, జల్పల్లి గ్రామ పరిధిలోని చందన చెరువు దాదాపు 34.1 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. జీహెచ్ఎంసీ పరిధికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతం వాణిజ్య, నివాసపరంగ