వెండితెర మీదనే కాదు క్రికెట్ గ్రౌండ్లో కూడా తమ సత్తా చాటుతున్న దక్షిణాదికి చెందిన పలువురు సినీ తారలు మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో స్థానిక లీగ్ క్రికెటర్లతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు.
పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ (Celebrity Cricket Carnival) ట్రోఫీ, జెర్సీని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆవిష్కరించారు.