పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) ఉన్నట్టా? లేనట్టా? అంటే అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. ఇంతకీ ఈ విధానం రాష్ట్రంలో అమలు చేస్తారా? లేక ముగింపు పలుకుతారా? అన్న అంశంపై క్లారిటీ ఇవ్వడంలేదు.
విద్యార్థుల ఫలితాలపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు అనుమానం తట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఒకలా ఉంటే ఉత్తమ మార్కులు రావడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వారిలో తలెత్తాయి.