C-295 Aircraft | గుజరాత్‌లోని వడోదర (Vadodara)లో ఏర్పాటు చేసిన సి-295 ( C-295 Aircraft) సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని (C-295 Aircraft Manufacturing Facility) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.
స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారు చేసిన సీ-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ విమానం సోమవారం భారత వాయు సేనలోకి ప్రవేశించింది.
దేశంలో తొలి సీ-295 (C-295 Aircraft) మధ్యశ్రేణి రవాణా విమానం హిండన్ ఎయిర్‌బేస్‌లో సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.