C-295 Aircraft | భారత వైమానిక దళ అమ్ములపొదిలో సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్
దేశంలో తొలి సీ-295 (C-295 Aircraft) మధ్యశ్రేణి రవాణా విమానం హిండన్ ఎయిర్‌బేస్‌లో సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
లక్నో : దేశంలో తొలి సీ-295 (C-295 Aircraft) మధ్యశ్రేణి రవాణా విమానం హిండన్ ఎయిర్‌బేస్‌లో సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 20న సీ-295 విమానం గుజరాత్‌లోని వదోదరలో ల్యాండ్ అయింది. స్పెయిన్‌లో ఈ విమానాలను వాయుసేనకు అప్పగించిన అనంతరం కొద్దిరోజులకే ఇవి దేశానికి చేరుకున్నాయి.
ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో ఈ విమానాల సేకరణకు రూ. 21,935 కోట్ల ఒప్పందం జరిగిన రెండేండ్ల తర్వాత ఈనెల 13న ఎయర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి తొలి విడతలో 56 సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను రిసీవ్ చేసుకున్నారు. కాలం చెల్లిన అవ్రో-748 విమానాల స్ధానంలో అత్యాధునిక సీ-295 విమానాలు ఐఏఎఫ్ అమ్ములపొదిలో చేరాయి.
కాగా, గత ఏడాది అక్టోబర్‌లో వదోదరలో 295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్ధాపన చేశారు. ప్రైవేట్ కన్సార్టియం ఆధ్వర్యంలో భారత్‌లో తయారయ్యే తొలి సైనిక విమాన ప్లాంట్ ఇదే కావడం గమనార్హం. సీ-295 అత్యాధునిక రవాణా విమానంగా పేరొందింది. ఈ విమానంలో 71 మంది సైనిక దళాలను, 50 పారాట్రూపర్లను ఇది చేరవేస్తుంది. ప్రస్తుత బరువైన విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు యుద్ధసామాగ్రిని, సైనికులను సులభంగా తరలిస్తాయి.
Read More :
Asian Games | రోయింగ్‌లో భారత్‌కు నాలుగో పతకం.. పురుషుల ఫోర్ ఈవెంట్లో కాంస్యం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

