‘భక్షక్'లో నా పాత్ర కథను నడిపిస్తుంది. అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు దొరుకుతాయి. ఓ విధంగా నా మానసిక స్థితిని మెరుగుపరచిందీ ఈ పాత్ర’ అంటున్నారు భూమి పెడ్నేకర్.
క్రైమ్ థ్రిల్లర్లకు, ఇన్వెస్టిగేషన్ చిత్రాలకు ఓటీటీ ప్రేక్షకులు బలంగా ఓటేస్తున్నారు. దీంతో దర్శక, నిర్మాతలు ఈ తరహా చిత్రాలను నిర్మించి నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.