వెండితెరకు పొలిటికల్ నేపథ్యం వున్న కుటుంబం నుంచి పరిచయమైన మరో హీరో జైద్ఖాన్. కర్ణాటకలో సీనియర్ రాజకీయనాయకుడు జమీర్ అహ్మద్కుమారుడు జైద్ఖాన్ నటించిన చిత్రం ‘బనారస్'.
జైద్ ఖాన్, సోనాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘బనారస్'. ఈ చిత్రానికి జయతీర్థ దర్శకత్వం వహిస్తున్నారు. తిలక రాజ్ బల్లాల్ నిర్మాత. వారణాసి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.