‘బనారస్’ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది
‘బనారస్' చిత్రంలో వినూత్నమైన ప్రేమకథతో పాటు మిస్టీరియస్ అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయని చెప్పారు కథానాయకుడు జైద్‌ఖాన్.
‘బనారస్’ చిత్రంలో వినూత్నమైన ప్రేమకథతో పాటు మిస్టీరియస్ అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయని చెప్పారు కథానాయకుడు జైద్‌ఖాన్. ఈ సినిమా ద్వారా ఆయన వెండితెరపై అరంగేట్రం చేస్తున్నారు. జయతీర్థ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హీరో జైద్‌ఖాన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ చెప్పిన సంగతులు..
బనారస్ (వారణాసి) నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. టైమ్ ట్రావెల్‌తో పాటు కుటుంబ అనుబంధాలు, వినోదం, సస్పెన్స్ అంశాల కలబోతగా ఉంటుంది. కథలో అంతర్లీనంగా ఉండే మిస్టీరియస్ అంశాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. అవేమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా వారణాసి నగరం తాలూకు మార్మికత, విజువల్ బ్యూటీని ఈ సినిమాలో చాలా అందంగా ప్రజెంట్ చేశాం. పక్కా కమర్షియల్ ప్రేమకథే అయినా..యూనివర్సల్ పాయింట్‌తో ఆకట్టుకుంటుంది.
తొలుత కన్నడంలోనే…
తొలుత ఈ చిత్రాన్ని కన్నడంలోనే తీశాం. దక్షిణాది వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన నా మిత్రబృందానికి ఈ సినిమా చూపిస్తే అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇదని, పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. బనారస్ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథలొచ్చాయి. అయితే ఈ సినిమా అన్నింటిలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమా చూశాక ఒక్కసారైనా బనారస్‌ను చూసి రావాలనుకుంటారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

