గత నెలలో షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు సహా రజతం, నాలుగు కాంస్య పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు.. అంటాల్యలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-3లో మాత్రం రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్ల వైఫల్య ప్రదర్శన కొనసాగుతున్నది. కాంపౌండ్, రికర్వ్ టీమ్ ఈవెంట్స్‌లో నిరాశపరిచిన మన ఆర్చర్లు.. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలోనూ తేలిపోయారు.