అంటాల్య(టర్కీ): గత నెలలో షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు సహా రజతం, నాలుగు కాంస్య పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు.. అంటాల్యలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-3లో మాత్రం రిక్తహస్తాలతో వెనుదిరిగారు. కాంపౌండ్ ఆర్చర్లు నిరాశపరిచిన వేళ భారీ ఆశలతో బరిలోకి దిగిన రికర్వ్ ఆర్చర్లు పోడియం ఫినిష్ లేకండానే పోరాటాన్ని ముగించారు.
శనివారం వేర్వేరు విభాగాల్లో రికర్వ్ ఆర్చర్లు దీపికా కుమారి, తరుణ్‌దీప్‌రాయ్ మెడల్ రౌండ్‌కు అర్హత సాధించడంలో విఫలం కాగా, చివరి వరకు గెలుపు దోబూచులాడిన పోరులో సిమ్రన్‌జీత్ 5-6(29-28, 24-29, 27-24, 27-27, 23-29)(8-11)తో అన్ సన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. పురుషుల విభాగంలో పార్త్ సాలుంకే, అతాను దాస్, ధీరజ్ బొమ్మదేవర ప్రత్యర్థుల చేతుల్లో ఓడి నిష్ర్కమించారు.