ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా తొలుత ఆమె ప్రసంగిస్తూ.. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని తెలిపారు.