నాగార్జునసాగర్ పూర్తిగా నిండిన ప్రతి ఏడాది తెలంగాణలోని ఎడమ కాల్వ కింద వానకాలంతో పాటు యాసంగి పంటలకు పుష్కలమైన సాగునీరు అందుతుంది. హైదరాబాద్, ఇతర జిల్లాల తాగునీటికీ ఎలాంటి ఢోకా ఉండేది కాదు.
హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరాకు ప్రాణాధారమైన కృష్ణాజలాల తరలింపునకు ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్‌లో పుష్కలంగా నీటిమట్టం ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన అధికార యం�