జాతీయ భద్రతా సలహా బోర్డు (ఎన్ఎస్ఏబీ) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకం మంగళవారం నుంచి రెండేండ్లు పాటు కొనసాగనుంది.
పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న క్రమంలో కేంద్రం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు (ఎన్ఎస్ఏబీ)ని పునర్వ్యవస్థీకరించింది.