జూలపల్లి కొచ్చెరువులో శనివారం మత్స్యకారుల వలకు 15 కిలోల బంగారు తీగ చేప చిక్కింది. బరువైన మీనాన్ని చూసి మత్స్యకారుడు సంబురపడ్డాడు. ఇటీవల కాలంలో ఈ చెరువులో ఇంత పెద్ద చేప చిక్కలేదని సంతోషం వ్యక్తం చేశాడు.
గోదావరిఖనిలోని గోదావరి నదిలో శనివారం చేపల వేటకు వెళ్లిన యువకులకు 15కిలోల బొత్స చేప చిక్కింది. ప్రస్తుతం గోదావరిలో నీటిశాతం తగ్గడంతో హనుమాన్‌నగర్‌కు చెందిన కొందరు యువకులు అర్ధరాత్రి గోదావరి బ్రిడ్జి వద�