భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండ సుర్రుమంటున్నది. నాలుగు రోజులుగా రోజురోజుకీ పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో పాటు రాత్రివేళ ఉక్కపోత కూడా నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఏకకాలంలో వర్షపాతం, వేడి తీవ్రతలు రాబోయే కాలంలో మరింత తరచుగా, తీవ్రంగా, విస్తృతంగా మారుతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.