పెన్ పహాడ్ నవంబర్ 02 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని దుపహాడ్ గ్రామంలో విద్యుత్ ఘాతుకంతో యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బిట్టు వీర భద్రయ్య చిన్నకుమారుడు బిట్టు అభి వర్మ (24) అను వ్యక్తి గ్రామంలో ఎలక్ట్రానిక్ పనులు చేస్తుంటాడు.
ఆదివారం ఉదయం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లో ఫీజు వైరును ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా వైరును సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి వీర భద్రయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ టి.రాములు తెలిపారు. అభివర్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.