యాదాద్రి: యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ.29,96,634 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 6,23,874, వీఐపీ దర్శ నాల ద్వారా రూ. 4,50,000, నిత్య కైంకర్యాలతో రూ.1,800, సుప్రభాతం ద్వారా రూ.5,200, క్యారీబ్యాగులతో రూ.6,500, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 2,43,000, కల్యాణ కట్టతో రూ.69,600, ప్రసాద విక్రయంతో రూ.11,48,025, శాశ్వత పూజల ద్వారా రూ.28,812,
వాహన పూజల తో రూ. 22,000, టోల్గేట్తో రూ.2,160, అన్నదాన విరాళంతో రూ. 13,013, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,47,452, వేద ఆశీర్వచనం ద్వారా రూ. 17,028, యాదరుషి నిలయంతో రూ.70,870, పాతగుట్టతో రూ.1,47,300తో కలుపుకుని రూ. 29,96,634 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.