
బొడ్రాయిబజార్: శ్రావణమాసం చివరి ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యా లమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే అమ్మ వారికి బోనాల సమర్పణకు మహిళలు, భక్తులు బారులు తీరగా డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, బోనాల పాటలు, యువకుల నృత్యాలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

చిన్నా పెద్ద తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తొలి బోనాన్ని దేవాలయ కమిటీ చైర్మన్ బైరు వెంకన్నగౌడ్ సమర్పించి అమ్మ వారిని దర్శించుకొని చీరె సారె సమర్పించడంతో పాటు భక్తులు కోళ్లను, యాటలను బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం సమయంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తీసుకొచ్చి డప్పు చప్పుళ్ళ మధ్య నృత్యాలు చేస్తూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమ ర్పించి అమ్మ వారిని వేడుకున్నారు.

కరోనా నిబంధనల మేరకు భక్తులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. కాగా అమ్మవారిని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవి అనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, టీఆర్ఎస్ బీరవోలు శ్రీహర్ష, మొరిశెట్టి శ్రీనివాస్, బీజేపీ , కాంగ్రెస్ నాయకులు, డీఎస్పీ మోహన్‌కుమార్, సీఐ ఆంజనేయులులు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భారీ ఎత్తున హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేయగా సీఐ ఆంజ నేయులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందో బస్తు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు బైరు వెంకన్నగౌడ్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ కక్కిరేణి నాగయ్యగౌడ్, కౌన్సిలర్లు చిరివెళ్ళ లక్ష్మికాంతమ్మ, రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి, బూర బాలసైదులు, నాయకులు బూర మల్సూర్‌గౌడ్, అనంతుల నాగరాజు, రాపర్తి సైదులు, బైరు మహేశ్, కక్కిరేణి శివ తదితరులు పాల్గొన్నారు.
