
బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విస్తరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి పోస్టాఫీసు వరకు దుకాణాలను తొలగించి రోడ్డును విస్తరించిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు పోస్టాఫీసు నుంచి ఎస్వీ డిగ్రీ కళాశాల బైపాస్ వరకు రోడ్డును విస్తరించేందుకు సిద్ధమయ్యారు.
ఈ మేరకు రోడ్డు విస్తరణలో భాగంగా ఇటీవల భారీ వృక్షాలను తొలగించగా సోమవారం రోడ్డు పైకి వచ్చిన దుకాణాలను అంచులను తొలగిస్తూ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేటలో ఈ ప్రధాన రహదారి విస్తరణ అనంతరం రోల్ మోడల్‌గా నిలవనుంది.