బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధి పనులకు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు 12కోట్ల వ్యయంతో చేపట్టే ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కలల ప్రాజెక్టు అయిన శ్రీ వేంకటే శ్వరస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ
రామా నుజ జీయర్ స్వామి నేడు సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ఆలయానికి విచ్చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు తెలిపారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జీయర్ స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొనడం ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలని ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దన్నారు.