
సూర్యాపేట: ఆరోగ్య సమాజమే లక్ష్యంగా పని చేయాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పీడీ, ఐసీడీఎస్, జ్యోతి పద్మ ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 2018లో ప్రారంభించిన పోషణ అభియా న్ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రక్త హీనత, ఫౌష్టికాహర లోపం, తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశాలపై మహిళల్లో అవగాహన కల్పించాలని ఆయన అన్నా రు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషక విలువల తో కూడిన పౌష్టికాహరం అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఐసీడీఎస్ ద్వారా అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
బాల్య వివాహలను అరికట్టాలని , కిషోర బాలికల్లో రక్త హీనతపై ఆరోగ్య సలహలు అందించడంతో పాటు పోషణ వాటికలు ఏర్పాటు చేసి పోషకాహరం అందించాలన్నారు. సమావేశంలో పీడీ కిరణ్కుమార్, డీఎస్వో విజయ లక్ష్మీ, డీఏవో రామారా వు నాయక్, డీఎంహెచ్వో కోటాచలం, డీఐవో వెంకటరమణ, ఏవో శ్రీదేవి, పోషణ అభియాణ్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.