రెడ్డిలంతా ఐక్యంగా ఉండాలి
రెడ్లందరూ ఐక్యంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని పిల్లలమర్రి స్టేజీ సమీపంలో గల డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన రెడ్ల ఆత్మీయ వనభోజన మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు.
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- ఘనంగా రెడ్ల ఆత్మీయ వనభోజన మహోత్సవం
సూర్యాపేట రూరల్, డిసెంబర్ 25 : రెడ్లందరూ ఐక్యంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని పిల్లలమర్రి స్టేజీ సమీపంలో గల డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన రెడ్ల ఆత్మీయ వనభోజన మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని పేద రెడ్లకు సాయం చేసి ఆదుకోవాలన్నారు. పేద రెడ్డి విద్యార్థుల ఉన్నత చదువుకు రెడ్డి సంఘం నుంచి సాయమందించాలని సూచించారు. త్వరలో రెడ్డి సంక్షేమ సంఘం భవనం ఏర్పాటు చేస్తానన్నారు. భవనానికి స్థలం సైతం చూశామని, వచ్చే సంవత్సరం నాటికి రెడ్డి సంక్షేమ సంఘం భవనంలోనే సమావేశం ఏర్పాటు చేసుకుందామన్నారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించి 10మంది పేద విద్యార్థులకు రూ.10వేల చొప్పున మంత్రి జగదీశ్‌రెడ్డి, డాక్టర్ భూమిరెడ్డి అందించారు. జబర్దస్త్ టీం కళాకారులు ఆటపాటలతో అలరించారు. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గవ్వా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సంఘం సెక్రటరీ దేవిరెడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు బీరవోలు రవీందర్‌రెడ్డి, చిలుముల సునీల్‌రెడ్డి, కొండపల్లి దిలీప్‌రెడ్డి, నూకల వెంకట్‌రెడ్డి, దండా వెంకట్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కట్కూరి చంద్రారెడ్డి, డాక్టర్ భూమిరెడ్డి, కొండపల్లి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సైదిరెడ్డి, అనంతరెడ్డి, సైదిరెడ్డి పాల్గొన్నారు.
అయ్యప్ప మండల పూజకు మంత్రికి ఆహ్వానం
బొడ్రాయిబజార్ : జిల్లాకేంద్రంలోని శబరినగర్ అయ్యప్పస్వామి ఆలయంలో ఈ నెల 27న అయ్యప్ప స్వామి 42వ మహా మండల పూజ నిర్వహించనున్నారు. పూజకు హాజరుకావాలని కోరుతూ క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఆహ్వానపత్రిక అందించారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

