ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
అప్పన్నపేటలో పీహెచ్సీ సబ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
గరిడేపల్లి, సెప్టెంబర్ 5 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని అప్పన్నపేట గ్రామంలో రూ.16 లక్షలతో పీహెచ్సీ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. గ్రామాలను అనుసంధానం చేసే బ్రిడ్జిల నిర్మాణానికి, రైతుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాతా శ్రీనివాస్‌గౌడ్, హుజూర్నగర్ ఏఎంసీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, అప్పన్నపేట సర్పంచ్ చంద్రారెడ్డి, ఎంపీటీసీ కడప ఇసాక్, ఉప సర్పంచ్ ఎరగొర్ల విజయలక్ష్మీరాంబాబు, వార్డు సభ్యులు మదార్, రేణుక, జానకిరాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు గుర్రం వెంకట్ రెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
జాన్‌పహాడ్ దర్గా అభివృద్ధికి కృషి..
పాలకవీడు : మండలంలోని జాన్‌పహాడ్ దర్గాను ఆదివారం ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థ్ధనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్ జాని ఆయనకు స్వాగతం పలికారు. పూజా సామగ్రి, గంధం కలశంతో ఎమ్మెల్యే సైదిరెడ్డిలు సైదులు బాబా సమాధుల చుట్టూ ప్రదక్షిణ చేసి చాదర్, పూలమాలలు సమర్పించారు. ఆయన వెంట హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి , నేరేడుచర్ల మున్సిపల్ వైస్‌చైర్మన్ చల్లా శ్రీలతారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మలమంటి దర్గారావు, పాలకవీడు పీఏసీఎస్ చైర్మెన్ యరెడ్ల సత్యనారాయణరెడ్డి , సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి, నాయకులు, చిత్తలూరి సైదులు, సురేశ్, వెంకటరెడ్డి, అశోక్‌నాయక్, మార్కండేయ ఉన్నారు.