తిరుమలగిరి: సీజనల్ వ్యాధుల విషయంల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర పుర పాలక శాఖ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ హైదరాబాద్ ఆదేశానుసారం సీజనల్ వ్యాధులు రాకుండా ఆదివారం పదిగంటల పది నిమిషాలకు మురుగు కాల్వల్లో అయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేసే కార్యక్రమం చేపట్టింద దన్నారు.
ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని, ప్రజలు ఇండ్ల చుట్టుపక్కలా, ఇండ్లలో నీరు నిలువ ఉం డకుండా చూసుకోవాలని కోరారు. నీరు నిలిచి ఉంటే డెంగ్యూ, మలేరియా, టైఫాడ్ వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.